జేక్ ఫ్రేజర్ సింప్లీ సూపర్
హైదరాబాద్ బౌలర్లకు షాక్
న్యూఢిల్లీ – ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో హైదరాబాద్ , ఢిల్లీ మధ్య ఆసక్తికర పోరు సాగింది. ఇరు జట్లు భారీ ఎత్తున రన్స్ చేశారు. కానీ చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 67 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది.
గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో పేలవమైన ఫామ్ కనబర్చిన హైదరాబాద్ ఇప్పుడు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతోంది. ఓ వైపు బ్యాటింగ్ తో రెచ్చి పోతే మరో వైపు బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు.
267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ను కట్టడి చేశాడు టి. నటరాజన్ . కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. ఇక ఢిల్లీ జట్టులో ఓ వైపు వికెట్లు రాలుతున్నా ఎక్కడా తడబాటుకు గురి కాలేదు. ఒకానొక దశలో ఉత్కంఠకు తెర తీశాడు ఢిల్లీ బ్యాటర్ జేక్ ఫ్రేజర్.
సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 18 బంతులు మాత్రమే ఎదుర్కొన జేక్ ఏకంగా 5 ఫోర్లు 7 భారీ సిక్స్ లతో విరుచుకు పడ్డాడు. 65 పరుగులు చేశాడు. అతడికి తోడు పంత్ 44 రన్స్ చేసినా, అభిషేక్ ఆకట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. 67 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.