జేక్ ఫ్రేజర్ కు బిగ్ ఛాన్స్
రిజర్వ్ ఆటగాడిగా చోటు
ఆస్ట్రేలియా – ఆసిస్ క్రికెట్ బోర్డు సంచలన ప్రకటన చేసింది. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టలో కీలకమైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు.
కాగా వచ్చే నెల జూన్ లో జరిగే ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే ఆస్ట్రేలియా ఫైనల్ టీమ్ లో జేక్ ఫ్రేజర్ కు చోటు దక్కలేదు. కానీ ఐపీఎల్ లో సత్తా చాటడంతో ఏసీసీ సెలక్షన్ కమిటీ మరోసారి సమావేశమైంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
యంగ్ క్రికెటర్ జేక్ ఫ్రేజర్ ను రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో చేర్చినట్లు వెల్లడించింది. దీంతో వరల్డ్ కప్ జట్టులో ఆడే ఛాన్స్ దక్కనుంది. ఒకవేళ ఎంపిక చేసిన క్రికెటర్లలో ఎవరైనా గాయ పడినా లేదా అర్ధాంతరంగా ఆడక పోయినా రిజర్వ్ ఆటగాళ్లలో ఒకరిని తీసుకుంటారు.
ఇప్పటికే జట్టును ప్రకటించింది ఆసిస్. ఇక ఆసిస్ జట్టు కెప్టెన్ గా మిచెల్ మార్ట్ ఉండనున్నాడు. ఈ విషయాన్ని చీఫ్ సెలెక్టర్ బెయిలీ వెల్లడించాడు.