టీటీడీ ఆరోపణలు అబద్దం – జకియా ఖానం
కావాలని తనపై దుష్ప్రచారం చేశారని ఫైర్
అన్నమయ్య జిల్లా – టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి తాను రూ. 65 వేలు తీసుకుని లేఖలు ఇచ్చానంటూ తనపై టీటీడీ విజిలెన్స్ వింగ్ కేసు నమోదు చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జఖియా ఖానుం . ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా అబద్దమని కొట్టి పారేశారు. తనను కావాలని బద్నాం చేసేందుకు ఆడుతున్న నాటకం అంటూ పేర్కొన్నారు.
విచిత్రం ఏమిటంటే కృష్ణ తేజ అనే పిఆర్వో ఎవరో కూడా నాకు తెలియదన్నారు జఖియా ఖానం. అంతే కాదు టీటీడీ తనపై మోపిన అభియోగంలో చంద్రశేఖర్ అనే వ్యక్తిని తాను కలవ లేదన్నారు. ఎవరికీ సిఫారసు లేఖలు ఇవ్వలేదన్నారు. శశి కుమార్ ఎలా వచ్చారని ప్రశ్నించారు జకియా ఖానం.
అయితే లెటర్లు ఎవరు అడిగినా ఇస్తూ వచ్చామని తెలిపారు. కాగా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన వివాదం గురించి తనకు ఇప్పుడే తెలిసిందన్నారు . తనకు పీఆర్ఓలు లేరని, ఉన్న పీఆర్ఓ సరిగా స్పందించడం లేదని తీసి వేశామన్నారు జఖియా ఖానం.
ఈ నాలుగు సంవత్సరాల కాలంలో తాను ఎలాంటి లిమిట్స్ దాట లేదన్ఆనరు. చట్ట పరంగా నడుచుకుంటున్నానని తెలిపారు. ఇన్నేళ్ళలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగ లేదన్నారు. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి మంచి రాజకీయ నేపథ్యం ఉందన్నారు.