జెమ్ లాంటోడు జేమ్స్ అండర్సన్
ఇంగ్లండ్ – ప్రపంచ క్రికెట్ రంగంలో మోస్ట్ ఫెవరబుల్ క్రికెటర్ గా పేరు పొందాడు ఇంగ్లండ్ కు చెందిన జేమ్స్ అండర్సన్. అద్బుతమైన బంతులతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ కలిగి ఉన్న ఈ ఆటగాడి గురించి ఎంత చెప్పినా తక్కువే.
తాను క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. క్రికెట్ అభిమానులను నిరాశ పరిచాడు. 188 టెస్టులలో 704 వికెట్లు తీశాడు. ఇందులో 5 వికెట్లు 32 సార్లు తీశాడు. ఇది ఓ రికార్డ్ . 22 ఏళ్ల పాటు క్రికెట్ లో కొనసాగాడు. ఇంగ్లండ్ కు అద్భుతమైన విజయాలను కట్ట బెట్టడంలో కీలక పాత్ర పోషించాడు జేమ్స్ అండర్సన్.
ఈ సందర్బంగా సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనలాంటి బౌలర్ ను చూడలేదని కొనియాడారు. యాక్షన్ , వేగం, కచ్చితత్వం, స్వింగ్ , ఫిట్ నెస్ తో బౌలింగ్ చేయడం అద్భుతం అంటూ కితాబు ఇచ్చాడు. నీ ఆట తీరుతో కొన్ని తరాలకు స్పూర్తిని కలిగించారంటూ ప్రశంసలు కురిపించాడు .
ఇదిలా ఉండగా జేమ్స్ అండర్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో ఎదుర్కొన్న గొప్ప క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్ ఒకడు అంటూ పేర్కొన్నాడు.
అతను వచ్చిన తర్వాత, నేను ఇక్కడ చెడ్డ బంతిని వేయలేనని అనుకుంటాను, అతను అలాంటి ఆటగాడు. ఏది ఏమైనా ఇంగ్లండ్ కే కాదు యావత్ క్రికెట్ ప్రపంచానికి జేమ్స్ అండర్సన్ లేని లోటు పూడ్చ లేనిది అని చెప్పక తప్పదు.