NEWSNATIONAL

కృష్ణ సింగ్ నాకంటే స‌మ‌ర్థుడు – పీకే

Share it with your family & friends

జ‌న్ సురాజ్ అభ్య‌ర్థిపై కామెంట్స్

బీహార్ – జ‌న్ సురాజ్ పార్టీ చీఫ్ , ప్ర‌ముఖ భార‌తీయ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బుధ‌వారం బీహార్ రాష్ట్ర రాజ‌ధాని పాట్నాలో మీడియాతో మాట్లాడారు. బీహార్ ఉప ఎన్నికల పార్టీ అభ్యర్థిపై స్పందించారు.

బీహార్ విధానసభ ఎన్నికల్లో ఇలాంటి అభ్యర్థులను మీరు ఎప్పుడైనా చూసినట్లయితే నాకు చెప్పండి. నేను ఇప్పటివరకు ప్రజలకు చెప్పాను, వారికి హామీ ఇచ్చాను. ఎన్నికల్లో పోటీ చేసి జన్ సురాజ్‌లో ప్రధాన పాత్ర పోషించే ప్రతి అభ్యర్థి నా కంటే సమర్థుడై ఉంటాడని స్ప‌ష్టం చేశారు.

ఆ వ్యక్తి బీహార్ నేల కొడుకు, స్థానికుడు, ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి, జన్ సురాజ్ పార్టీలో చేరాడ‌ని అన్నారు. బీహార్‌ను మెరుగు పరచడం కోసమే ఈ నిర్ణ‌యం తీసుకోవడం జ‌రిగింద‌న్నారు ప్ర‌శాంత్ కిషోర్.

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలకు తరారీ నుంచి జన్ సూరాజ్ పార్టీ అభ్యర్థిగా మాజీ వైస్ చీఫ్ ఆర్మీ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ కృష్ట సింగ్ ను ఎంపిక చేశారు. ఈ సంద‌ర్భంగా మాజీ ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాల‌నే ఇక్క‌డికి వ‌చ్చాన‌ని అన్నారు.

మనకు ప్రత్యర్థులు కనిపించరు, మన లక్ష్యం మాత్రమే చూస్తామ‌న్నారు. మా లక్ష్యం చాలా పవిత్రమైనది, మాకు క్లీన్ ఇమేజ్ ఉందన్నారు.