జన సేనానికి గ్రాండ్ వెల్ కమ్
దారి పొడవునా పూల వర్షం
అమరావతి – జనసేన పార్టీ చీఫ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అపూర్వమైన రీతిలో ఆదరణ లభించింది. పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. అడుగడుగునా జనం నీరాజనం పలికారు. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ చరిత్ర సృష్టించింది.
ఇటు అసెంబ్లీ అటు లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటింది. టీడీపీ, భారతీయ జనతా పార్టీలతో పొత్తు లో భాగంగా జనసేన పార్టీ 21 శాసన సభ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలలో పోటీ చేసింది. పోటీ చేసిన అన్నింట్లోను గెలుపు జెండా ఎగుర వేసింది. దీంతో వంద శాతం ఉత్తీర్ణతను సాధించి సత్తా చాటింది.
ఉప ముఖ్యమంత్రిగా కొలువు తీరిన పవన్ కళ్యాణ్ మంగళవారం సచివాలయానికి వెళ్లారు. అక్కడ తనకు కేటాయించిన రెండో బ్లాక్ లోని 211 రూమ్ లోకి వెళ్లారు. ఆయనతో పాటు తన పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లకు కూడా చాంబర్లను కేటాయించింది ప్రభుత్వం.
అయితే కేబినెట్ లో డిప్యూటీ సీఎం హొదాలో ఉన్న పవన్ కళ్యాణ్ కు అత్యంత కీలకమైన పదవులను కట్టబెట్టడం విశేషం.