గెలుపు ఓటములపై జనసేన ప్రభావం
వెల్లడించిన జాతీయ సర్వే సంస్థలు
అమరావతి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. జనం నుంచి భారీ స్పందన లభిస్తోంది. దీంతో పవన్ ఇప్పుడు సెంటర్ పాయింట్ గా మారారు. ఓ వైపు భారతీయ జనతా పార్టీ ముందు నుంచీ పవన్ ను దువ్వుతోంది. ఆయన బేషరతుగా కాషాయ పార్టీకి వెన్ను దన్నుగా నిలుస్తూ వచ్చారు. ఆయనే కాదు ఆయన కుటుంబానికి చెందిన మెగా ఫ్యామిలీ మొత్తం గంప గుత్తగా బీజేపీని భుజాన వేసుకుని మోస్తున్నారు.
ఓ వైపు విశాఖలో పేరు పోందిన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని తన అనుయాయులకు ధారదత్తం చేయాలని కేంద్రంలో కొలువు తీరిన మోదీ పరివారం ఎదురు చూస్తోంది. మరో వైపు బాధ్యత కలిగిన సీఎం జగన్ రెడ్డి కూడా ఏమీ అనలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే తనపై ఏ క్షణాన దర్యాప్తు సంస్థలు దాడి చేస్తాయనే భయంతో.
ఇక తనకు ఎదురే లేదని , 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ పదే పదే చెప్పుకునే చంద్రబాబు నాయుడు సైతం జైలు పాలు కాక తప్పలేదు. ఆ తర్వాత బయటకు వచ్చారు. ఇది పక్కన పెడితే ఇటు టీడీపీకి అటు బీజేపీకి మధ్య జనసేన కీలకం కానుంది. ఇదే విషయాన్ని సర్వే సంస్థలు పేర్కొంటుండడం విశేషం.