గ్లాస్ గుర్తు కేటాయింపునకు ఓకే
అమరావతి – ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి భారీ ఊరట లభించింది. ఆ పార్టీకి గ్లాసు గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిని సవాల్ చేస్తూ ఎలా కేటాయిస్తారంటూ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్ ) పార్టీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మంగళవారం గ్లాసు గుర్తుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలపైన దావాపై విచారణ చేపట్టింది ధర్మాసనం. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. జనసేనకు గ్లాస్ గుర్తు కేటాయించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. అన్నింటిని పరిగణలోకి తీసుకునే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది.
ఇందుకు సంబంధించి ఎందుకు అభ్యంతరాలు ఉండాలని పిటిషనర్ ను ప్రశ్నించింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది ధర్మాసనం. దీంతో జనసేన పార్టీకి ఈ సారి జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది.