టీటీడీ ఈవో ధర్మా రెడ్డిపై ఫిర్యాదు
జనసేన నాయకులు ఆగ్రహం
తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కార్య నిర్వహణ అధికారి (ఈవో) ఏవీ ధర్మా రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన తనకు సెలవు ఇవ్వాలని కోరుతూ రాసిన లేఖ రాశారు. దీనికి ఆయనకు అనుమతి ఇవ్వలేదు. టీటీడీ ఈవోగా కొలువు తీరిన నాటి నుంచి పుణ్య క్షేత్రాన్ని రాజకీయ క్షేత్రంగా మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా జగన్ రెడ్డి సర్కార్ పోయింది. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని జనసేన , బీజేపీ కూటమి కొత్తగా కొలువు తీరనుంది ఏపీలో. దీంతో ఆయా శాఖలలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా తిరుపతి లోని సీఐడీ కార్యాలయంలో జనసేన నాయకులు గురువారం టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి పై ఫిర్యాదు చేశారు. సదరు పదవికి అర్హత లేక పోయినా జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఐదేళ్ల పాటు ఈవోగా కొనసాగారని ఆరోపించారు.
విదేశాలకు పారి పోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన వెళ్లి పోకుండా చూడాలని కోరారు. టీటీడీలో ఆభరణాలు, నిధులు, శ్రీవాణి డబ్బులను జగన్ వెనకేసుకునేలా చేశారంటూ ఆవేదన చెందారు.
టీటీడీనీ నాశనం చేశారని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే లీవ్ కావాలని ఎందుకు కోరుకుంటారంటూ ప్రశ్నించారు. లెక్కలు అన్నీ చూశాకే అతడిని రిలీవ్ చేయాలని కోరారు. టోల్ గేట్ వద్ద నిఘా ఉంచాలని సూచించారు.