NEWSANDHRA PRADESH

జ‌న‌సేన స‌భ్య‌త్వ న‌మోదు ప్రారంభం

Share it with your family & friends

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వాటిని రెన్యువ‌ల్

అమ‌రావ‌తి – ప‌వ‌న్ క‌ళ్యాణ్ సారథ్యంలోని జ‌న‌సేన పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఇప్ప‌టికే పార్టీ చీఫ్ ఆదేశాల మేర‌కు మెంబ‌ర్ షిప్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున చేర్పించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో భాగంగా గురువారం నుంచి 10 రోజుల పాటు అన్ని నియోజ‌క‌వ‌ర్గాలు, మండ‌లాలు, గ్రామాల‌లో జ‌న‌సేన పార్టీలో చేర్పించేందుకు ప్ర‌య‌త్నం చేస్తారు.

ఈ విష‌యాన్ని పార్టీకి చెందిన పీఏసీ చైర్మ‌న్, రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ వెల్ల‌డించారు. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో రాష్ట్రంలో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింద‌ని, దీని గురించి రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌న్నారు.

ఇదే ఊపును జ‌న సేన‌కు చెందిన పార్టీ సైనికులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, శ్రేయోభిలాషులు, వీర మ‌హిళ‌లు, యువ‌తీ యువ‌కులు మ‌రింత ఉత్సాహంతో ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు నాదెండ్ల మ‌నోహ‌ర్.

అంతే కాకుండా ఇప్ప‌టికే న‌మోదైన 6.47 లక్షల క్రియాశీలక సభ్యత్వాలను రెన్యువల్‌ చేయించాలని ఆదేశించారు. జనసేనలో క్రియాశీలక సభ్యులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు .