జూలై 18 నుంచి జనసేన సభ్యత్వ నమోదు
10 రోజుల పాటు కొనసాగనున్న ప్రక్రియ
అమరావతి – జనసేన పార్టీ సభ్యత్వ నమోదుపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో తాజాగా జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు దుమ్ము రేపారు. 21 ఎమ్మెల్యేలతో పాటు 2 పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకుని వందకు 100 శాతం సక్సెస్ రేట్ ను సాధించింది.
ఇదిలా ఉండగా పార్టీని మరింత బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడంపై దృష్టి సారించాలని ఇప్పటికే ఆదేశించారు పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. పార్టీ అధ్యక్షుడు సూచనల మేరకు పార్టీకి చెందిన సీనియర్ నేతలు ముఖ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఈనెల 18 నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు.
ఇప్పటి వరకు మూడు విడతలుగా సభ్యత్వ నమోదు పూర్తి కాగా ప్రస్తుతం నాలుగవ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
ప్రతి శాసన సభ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది వాలంటీర్లకు నమోదు చేయనున్నారు. కాగా సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ , రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. సభ్యత్వ నమోదుపై దిశా నిర్దేశం చేశారు.