జనసేన అభ్యర్థి లోకం మాధవి శపథం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు ఆ పార్టీ అభ్యర్థి లోకం మాధవి శపథం. టీడీపీ, జనసేన కూటమికి కనీసం 125 సీట్లకు పైగా వస్తాయని అన్నారు. వైసీపీ పనై పోయిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం తప్పదన్నారు. ప్రజలు ఆయనను ఓడించేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు.
2030 కల్లా ఏపీలో నెల్లిమర్లను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గా మారుస్తామని స్పష్టం చేశారు లోకం మాధవి శపథం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నెల్లిమర్లలో 100 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీలను స్థాపిస్తానని శపథం చేశారు. ఇందులో 5,000 మందికి పైగా జాబ్స్ కల్పిస్తామని చెప్పారు.
శనివారం లోకం మాధవి శపథం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలను నాశనం చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఆయనను ప్రజలు కోరుకోవడం లేదన్నారు. మూడు రాజధానుల పేరుతో రాజకీయం చేశాడని, ఏపీకి ఆయన వల్ల ఒరిగింది ఏమీ లేదన్నారు లోకం మాధవి శపథం.