తెలంగాణలో మానే గ్రూప్ పెట్టుబడి
శ్రీధర్ బాబుతో జీన్ మానే భేటీ
హైదరాబాద్ – తెలంగాణలో మరో కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు భారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్ లోని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలుసుకున్నారు ప్రపంచంలో పేరు పొందిన మానే గ్రూప్ సంస్థల అధ్యక్షుడు జీన్ మానే. ఈ సంస్థ రుచికరమైన ఉత్పత్తులను తయారు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీకి మంచి పేరుంది .
ఈ సందర్బంగా మంత్రితో భేటీ అయ్యారు జీన్ మానే. చాలా సేపు ఇద్దరి మధ్య చర్చలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ సమీపంలో రుచి కరమైన, స్నాక్స్ రుచులకు గాను రూ. 200 కోట్లతో కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు జీనే మానే.
తమ కంపెనీని మరింతగా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రాన్స్ సెక్టార్‌లో ఫ్రంట్ రన్నర్ గా ఉంది ఫ్రాన్స్‌కు చెందిన మానే గ్రూప్. అత్యాధునిక సాంకేతికత , ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన ప్రపంచ స్థాయి సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టుబడిని పెట్టనున్నట్లు తెలిపారు జీనే మానే.
,ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అధిక నాణ్యత రుచుల ఉత్పత్తిని తయారు చేస్తామని ప్రకటించారు.