గాంధీ..అంబేద్కర్ సేవలు గొప్పవి
బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ కామెంట్
ముంబై – ప్రముఖ బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ జరిగింది. మొత్తం ఏడు విడతలలో పోలింగ్ మొదటిసారిగా నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.
దేశ వ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతోంది. బీజేపీ సంకీర్ణ సర్కార్ కు ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమికి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పలు సర్వే సంస్థలు గంప గుత్తగా మోడీకి, ఆయన పరివారానికి జై కొడుతుండగా డిజిటల్ మీడియా మాత్రం ప్రతిపక్షాలకు మద్దతుగా తమ వాయిస్ వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా రాజకీయాలకు దూరంగా ఉండే నటీ నటులు ఉన్నట్టుండి సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది. ప్రధానంగా జాహ్నవి కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బీజేపీ సర్కార్ లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ దేశానికి గాంధీ, అంబేద్కర్ చేసిన సేవలు గొప్పవన్నారు. ఈ గొప్ప నేతల గురించి మరింత చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆమె కుల వ్యవస్థ గురించి కూడా పేర్కొన్నారు.