ఒప్పందం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
జపాన్ – జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి రోజే కీలకమైన పెట్టుబడులకు శ్రీకారం చుట్టారు . తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పటుకు అంగీకారం కుదిరింది.టోక్యోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందాన్ని కలిసి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు కంపెనీ ప్రతినిధులు.
దాదాపు రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ప్రాజెక్టును మారుబెన్ కంపెనీ ప్రారంభించనుందని స్పష్టం చేశారు ఈ సందర్బంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి. దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశామన్నారు. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సీఎం రేవంత్ సమక్షంలో సంతకాలు చేసన ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు. తమ ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ పేరుతో ముందుకు వెళుతున్నామని, పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరుస్తున్నామని చెప్పారు సీఎం.