సీఎంతో జపాన్ రాయబారి భేటీ
ఉపాధి అవకాశాలపై చర్చలు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో జపాన్ రాయ బారి సుజుకీ హిరోషి మర్యాద పూర్వకంగా తన నివాసంలో కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కూడా ఉన్నారు. ఈ సందర్బంగా విస్తృతంగా చర్చలు జరిపారు .
తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలకు ఎర్ర తివాచీ పరుస్తుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా ఉపాధి కల్పనే ధ్యేయంగా తాము పని చేస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలు, ఉపాధి కల్పన, తదితర అంశాలపై జపాన్ రాయబారి సుజుకీ హిరోషీ , రేవంత్ రెడ్డిల మధ్య చర్చలు జరిగాయి. త్వరలోనే భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.