SPORTS

మ్యాన్ ఆఫ్ ది సీరీస్ బుమ్రా

Share it with your family & friends

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో 15 వికెట్లు

బ్రిడ్జి టౌన్ – వెస్టిండీస్ వేదిక‌గా జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను భార‌త్ కైవ‌సం చేసుకుంది. 7 వికెట్ల తేడాతో అద్భుత విజ‌యాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 176 ర‌న్స్ చేసింది. కోహ్లీ 76 ర‌న్స్ చేస్తే , అక్స‌ర్ ప‌టేల్ 36 ర‌న్స్ చేశారు. అనంత‌రం ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పొయి 169 ప‌రుగులు చేసింది.

ఇదిలా ఉండ‌గా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు స్పీడ్ బౌల‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా. త‌ను టోర్నీ మొత్తంలో 15 వికెట్లు తీశాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చుక్క‌లు చూపించాడు. క‌ళ్లు చెదిరే బంతుల‌తో బిగ్ షాక్ ఇచ్చాడు.

ఒకానొక ద‌శ‌లో బుమ్రా బౌలింగ్ లో ప్ర‌ముఖ ఆట‌గాళ్లు డిఫెన్స్ ఆడేందుకే ప్ర‌యారిటీ ఇచ్చారంటే త‌న బౌలింగ్ ఎంత అద్బుతంగా , భ‌యంక‌రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇదిలా ఉండ‌గా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విశ్వ విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్టుకు ప్రైజ్ మ‌నీ కింద రూ. 20.40 కోట్లు ద‌క్కాయి. ఇక ర‌న్న‌ర‌ప్ జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాకు రూ. 10. 67 కోట్లు ల‌భించాయి.