ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్
ముంబై – ముంబై ఇండియన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 22 నుంచి టాటా ఐపీఎల్ బిగ్ టోర్నీ ప్రారంభం కానుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నాడు. తను గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధ పడుతున్నాడు. ఇంకా ఆ గాయం మానలేదు. ఇబ్బంది పెడుతుండడంతో తను ఆడలేక పోతున్నానని ఇప్పటికే ప్రకటించాడు. దీంతో స్పీడ్ స్టర్ స్థానంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటోంది. ఇదిలా ఉండగా జట్టులోకి రావాలంటే ముందుగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృందం నుంచి ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. దీంతో తను ఆడతాడా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
మార్చి నెలలో జరిగే అన్ని మ్యాచ్ లకు ఫాస్ట్ బౌలర్ బుమ్రా దూరం కావచ్చని అంచనా. ఇక ఐపీఎల్ లో అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ కు పేరుంది. దీని మేనేజ్ మెంట్ బలమైనది కావడం విశేషం. రిలయన్స్ ధీరూ భాయ్ అంబానీ భార్య నీతూ అంబానీ ఓనర్ గా ఉన్నారు. భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది తమ జట్టు కోసం. ఈసారి ఎలాగైనా సరే కప్ గెలవాలని డిసైడ్ అయ్యింది మేడం. ఇక మ్యాచ్ ల విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ టీం మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ , 29న గుజరాత్ టైటాన్స్ , 31న కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లకు బుమ్రా దూరం కానున్నాడు.