టెస్టు జట్టు కెప్టెన్ గా బీసీసీఐ ఎంపిక
ముంబై – బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కీలక ప్రకటన చేశాడు. తనతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో శనివారం ముంబైలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా భారత టెస్టు జట్టుకు ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై విస్తృతంగా చర్చించారు. పలువరు ఆటగాళ్ల పేర్లను పరిశీలించారు. చివరకు హెడ్ కోచ్ , సభ్యుల సూచనలతో ముంబైకి చెందిన స్టార్ పేసర్ స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రాను టెస్టు జట్టుకు కెప్టెన్ గా ఖరారు చేశారు.
ఈ విషయాన్ని అజిత్ అగార్కర్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది కూడా. ఇదిలా ఉండగా భారత జట్టుకు గతంలో కెప్టెన్ గా వ్యవహరించాడు బుమ్రా. పలు విజయాలను అందుకుంది టీమిండియా. కాగా కెప్టెన్సీ పదవి కోసం పలువురు పోటీ పడ్డారు. వారిలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ , కేఎల్ రాహుల్ , శ్రేయాస్ అయ్యర్ లు ఉన్నారు. కానీ చివరకు స్టార్ బౌలర్ అయితేనే జట్టుకు నాయకత్వ పరంగా బావుంటుందని భావించారు సెలెక్షన్ కమిటీ సభ్యులు.
మొత్తంగా ఈ టాప్ బౌలర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన కళ్లు చెదిరే బంతులతో ప్రత్యర్థులను భయ పెట్టడంలో, వికెట్లు కూల్చడంలో తనకు తనే సాటి. ఇక కెప్టెన్ గా ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.