జావేద్ అక్తర్ షాకింగ్ కామెంట్స్
బహు భార్యత్వం పై కీలక వ్యాఖ్యలు
ముంబై – ప్రముఖ బాలీవుడ్ సినీ రచయిత జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి పౌర స్మృతి (సీఏఏ)ని తీసుకు వచ్చింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదే సమయంలో సీఏఏ అమలు చేయకుండా స్టే ఇవ్వాలని కోరుతూ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో మోదీ సర్కార్ కు ఒకింత ఊరటను ఇచ్చిందని చెప్పక తప్పదు.
ఈ సందర్బంగా సీఐఐపై సీరియస్ కామెంట్స్ చేశారు ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ . ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకేసారి నలుగురు భార్యలు ఉండవచ్చని, చేసుకుంటే తప్పేమీ లేదని ఇస్లాం నమ్ముతుందన్నారు. ఇదే హిందువులకు కంటగింపుగా మారిందన్నారు. తమను చూసి అసూయ పడతారంటూ వాపోయారు.
యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయడానికి ఇదొక్కటే కారణమా? అయితే హిందువులకు కూడా ఈ హక్కు ఇస్తే సమస్యే ఉండదన్నారు జావేద్ అక్తర్. హిందువులు చట్ట విరుద్ధంగా” బహుభార్యత్వాన్ని అనుసరిస్తున్నారని ఆయన ఎత్తి చూపారు.