SPORTS

సోనీ స్పోర్ట్స్ నెట్ వ‌ర్క్ తో ఏసీసీ ఒప్పందం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా

ముంబై – బీసీసీఐ కార్య‌ద‌ర్శి, ఐసీసీ చైర్మ‌న్ , ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ జే షా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శుక్ర‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. 2024 నుండి 2031 వరకు జరిగే అన్ని ACC ఆసియా కప్ టోర్నమెంట్‌ల కోసం భారతదేశం ప్రత్యేక మీడియా హక్కులను మంజూరు చేసింద‌ని తెలిపారు జే షా.

ఈ మైలురాయి ఒప్పందం, మునుపటి హక్కుల చక్రం కంటే 70 శాతం పెరుగుదలతో, ఏసీసీ ఈవెంట్‌ల పెరుగుతున్న ప్రపంచ స్థాయిని నొక్కి చెబుతుందని పేర్కొన్నారు జే షా. సోనీ నైపుణ్యంతో అసాధారణమైన వీక్షణ అనుభవాన్ని అందించడంలో, ఆసియా క్రికెట్‌కు కొత్త బెంచ్ మార్క్‌లను సెట్ చేయడంలో నమ్మకంగా ఉన్నామని స్ప‌ష్టం చేశారు బీసీసీఐ , ఐసీసీ చైర్మ‌న్ .

ఈ సంద‌ర్బంగా ఆసియా ఖండంలో జ‌రిగే ప్ర‌తి మ్యాచ్ , ప్ర‌తి ఫార్మాట్ లో జ‌రిగే ప్ర‌తి ఆట‌ను సోనీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అందించ బోతోంద‌ని , క్రికెట్ అభిమానులు దీనిని గ‌మ‌నించాల‌ని సూచించారు జే షా. ప్ర‌స్తుతం ప్ర‌పంచ క్రికెట్ ను బీసీసీఐ శాసిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఐసీసీ కూడా భార‌త్ ప‌రం కావ‌డం తో మ‌న‌కు తిరుగే లేకుండా పోయింది.