రూ. 8.5 కోట్లు ప్రకటించిన జే షా
ముంబై – భారత దేశంలోనే అత్యంత ఆదాయం కలిగిన ఏకైక క్రీడా సంస్థ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). దేశానికి చెందిన ఇతర క్రీడా సంస్థలకు, అథ్లెట్లకు, సామాజిక సేవా కార్యక్రమాల కింద భారీ ఎత్తున సాయం చేస్తూ వస్తోంది బీసీసీఐ.
ఇదిలా ఉండగా సోమవారం ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు బీసీసీఐ కార్యదర్శి జే షా. 204లో పారిస్ లో జరిగే ఒలింపిక్స్ లో భారత దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అథ్లెట్లకు ఖుష్ కబర్ చెప్పారు. ఈ మేరకు వారికి సాయంగా ఏకంగా రూ. 8.5 కోట్లు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇది భారీ ఎత్తున నజరానా కావడం విశేషం.
భారత దేశం తరపున పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ బీసీసీఐ తరపున ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు జే షా. అంతే కాకుండా ప్రతి ఒక్కరు తమ ప్రతిభా పాటవాలతో దేశానికి గుర్తింపు తీసుకు వస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
మువ్వొన్నెల భారతీయ జెండా సగర్వంగా ఎగిరేలా అథ్లెట్లు బంగారు పతకాలతో రావాలని కోరారు బీసీసీఐ జాతీయ కార్యదర్శి.