దేశీవాలీ పోటీలలో ప్రైజ్ మనీ – జే షా
ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి
ముంబై – బీసీసీఐ కార్యదర్శి జే షా సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి దేశీయంగా జరిగే క్రికెటర్ టోర్నీలలో కూడా ప్రతిభ కలిగిన క్రికెటర్లను గుర్తించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. మంగళవారం ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా వేదికగా ఈ విషయం వెల్లడించారు.
దేశీయ క్రికెట్ ప్రోగ్రామ్ కింద అన్ని మహిళల , జూనియర్ క్రికెటర్ టోర్నీలలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కోసం ప్రైజ్ మనీని పరిచయం చేయాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు జే షా.
సీనియర్ పురుషుల కోసం విజయ్ హజారే , సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు ప్రైజ్ మనీ ఇవ్వబడుతుందని వెల్లడించారు బీసీసీఐ కార్యదర్శి.
ఈ చొరవ దేశీయ సర్క్యూట్‌లో అత్యుత్తమ పనితీరును గుర్తించి రివార్డ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ ప్రయత్నంలో అపెక్స్ కౌన్సిల్ అచంచలమైన మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు పేర్కొన్నారు.
దీని కారణంగా క్రికెటర్ల కు మరింత తోడ్పాటు అందించినట్లవుతుందని వెల్లడించారు.