షా..శాంసన్ పై ఎందుకింత కక్ష
బీసీసీఐ నిర్వాకం సర్వత్రా ఆగ్రహం
ముంబై – ఐపీఎల్ 2024లో అద్బుతమైన ఆట తీరుతోనే కాకుండా కెప్టెన్ గా కూడా రాణించాడు కేరళ స్టార్ సంజూ శాంసన్. ప్రస్తుతం పరుగుల వీరుల్లో తను కూడా ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. సోషల్ మీడియాలో టాప్ లో ఉన్నాడు ట్రెండింగ్ లో. ప్రధానంగా నాయకత్వ విషయంలో ఎలాంటి తప్పు పట్టడానికి వీలు లేకుండా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్న తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే లా చేస్తోంది.
ప్రధానంగా ఎందుకు బీసీసీఐ కావాలని పక్కన పెడుతోందంటూ క్రికెట్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా పంత్, కేఎల్ రాహుల్ పై ఉన్నంత ప్రేమ ఎందుకని సంజూ వరకు వచ్చే సరికల్లా ఉండడం లేదంటూ నిలదీస్తున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ , మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అయితే ఏకంగా శాంసన్ ను ఆకాశానికి ఎత్తేశాడు. తనను రోహిత్ శర్మ తర్వాత స్కిప్పర్ గా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన టీ20 వరల్డ్ కప్ టీమ్ ను ముందుగా ప్రకటించాడు. అందులో సంజూ పేరు లేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
చివరకు తనదే తప్పైందని, ఎందుకు తాను విస్మరించానో తెలియడం లేదని క్షమాపణలు కోరాడు. వరల్డ్ కప్ జట్టుకు అతడిని ఎంపిక చేయాలని కోరాడు. ఇక రవి శాస్త్రి, మంజ్రేకర్, గవాస్కర్ తో పాటు యువరాజ్ సింగ్, వసీమ్ అక్రమ్ సైతం శాంసన్ ను తీసుకోవాలని కోరుతున్నారు. ఇకనైనా బీసీసీఐ తన తీరు మార్చుకుంటుందని ఆశిద్దాం.