బాధ్యతలు చేపట్టిన జయ బాడిగ
సంస్కృతంలో ప్రమాణ స్వీకారం
అమెరికా – ఏపీకి చెందిన తెలుగు వారైన జయ బాడిగ సంచలనంగా మారారు. ఆమె అమెరికాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టుకు జడ్జిగా నియమించబడ్డారు. ఒక తెలుగు మహిళ ఇంత పెద్దటి స్థాయికి చేరడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఆమెకు ప్రమాణ స్వీకారం సందర్బంగా ఘన స్వాగతం లభించింది. సంస్కృత ప్రార్థన అసతోమాతో తన ప్రసంగాన్ని ముగించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో తొలి న్యాయమూర్తిగా జడయ బాడిగ బాధ్యతలు చేపట్టడం విశేషం.
ఆమె ఉస్మానియా యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. శాక్రమెంటో సుపీరియర్ కోర్టులో జయ బాడిగ నియమితులయ్యారు. ఆమె 2022 నుండి కోర్టు కమిషనర్‌గా పనిచేస్తున్నారు . కుటుంబ చట్టంలో నిపుణురాలిగా స్థిర పడ్డారు. ఆమె చాలా మందికి ఉపాధ్యాయురాలుగా, మా.ర్గ దర్శకురాలిగా పని చేశారు..గుర్తింపు పొందారు.
జయ బాడిగ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించారు. ప్రాథమిక విద్యను హైదరాబాద్‌లో పూర్తి చేశారు.1991 నుండి 1994 వరకు ఉస్మానియా యూనివర్శిటీ హైదరాబాద్‌లో సైకాలజీ, పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో పొందారు.