DEVOTIONAL

ఖ‌రీదైన వాచ్..హ్యాండ్ బ్యాగ్ అబ‌ద్దం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన జ‌యా కిషోరి

కోల్ క‌తా – ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వ‌క్త‌, మోటివేష‌న‌ల్ స్పీక‌ర్, మెంటార్ జ‌యా కిషోరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఖ‌రీదైన వాచ్ తో పాటు హ్యాండ్ బ్యాగ్ , పాద‌ర‌క్ష‌లు కూడా ఉండ‌డం ప‌ట్ల పెద్ద ఎత్తున ట్రోల్ కు గుర‌య్యారు. ఇవాళ సోష‌ల్ మీడియాలో ఆమె వైర‌ల్ అయ్యారు.

నిత్యం నీతి సూత్రాలు, భ‌క్తి మార్గం బోధించే స‌నాత‌న ధ‌ర్మం ఆచ‌రించ‌మ‌ని చెప్పే జ‌యా కిషోరి చేస్తున్నది ఏమిటి..చెబుతున్న‌ది ఏమిటో చూడాలంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీంతో జ‌యా కిషోరి మంగ‌ళ‌వారం కోల్ క‌తా లో జాతీయ మీడియాతో మాట్లాడారు.

బ్యాగ్ కస్టమైజ్డ్ బ్యాగ్.. అందులో లెదర్ లేదు, కస్టమైజ్ అంటే మీ ఇష్టానుసారం దీన్ని తయారు చేసుకోవచ్చు అని అన్నారుఅందుకే నా పేరు అని కూడా రాసి ఉందని తెలిపారు, తాను ఎప్పుడూ లెదర్ ఉపయోగించ లేదని స్ప‌ష్టం చేశారు.

నా క్లాస్ ల‌కు అటెండ్ అయ్యే వారికి తాను వ్య‌క్తిగ‌త కోరిక‌ల‌ను త్య‌జిమంచ‌మ‌ని చెప్ప‌లేద‌ని అన్నారు. డ‌బ్బు విలువ ఏమిటో, దాని ప్రాధాన్య‌త‌లు ఏమిటో కూడా తాను ముందే చెబుతున్నాన‌ని, ఎవ‌రికి తోచిన‌ట్లు వారు అనుకుంటే ఎలా అని ప్ర‌శ్నించారు జ‌యా కిషోరి.