స్వయంగా వెల్లడించిన సినీ నటి
సినీ నటి జయప్రద సోదరుడు రాజాబాబు ఇవాళ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు జయప్రద. హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జీవితంలో తనకు తోడుగా, చివరి దాకా వెన్నంటి ఉన్న తన సోదరుడు ఇక విడిచి పోవడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
ఇదిలా ఉండగా సినీ రంగంలో తన వెన్నంటి ఉన్నాడని, రాజకీయ రంగంలో తన ఉన్నతికి ఎనలేని కృషి చేశాడని, తను లేక పోవడం బాధాకరమని పేర్కొన్నారు జయప్రద. ఆయన లేని లోటు పూడ్చ లేనిదని అన్నారు. ఇంకా బతకాల్సిన వాడని, కానీ దేవుడు త్వరగా తమకు కాకుండా, దూరం చేశాడని కన్నీటి పర్యంతం అయ్యారు.
ఇదిలా ఉండగా జయప్రద ఎంపీగా గెలవడంలో కీలక పాత్ర పోషించారు సోదరుడు రాజాబాబు. పదవిలో ఉన్నా లేక పోయినా, సినీ రంగంలో సైతం మద్దతు ఇస్తూ వచ్చారు.