BUSINESSTECHNOLOGY

తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కే పెద్దపీట

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన ఐటీ ముఖ్య కార్య‌ద‌ర్శి

అమెరికా – తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలకు అధిక ప్రాధాన్య‌త ఇచ్చేలా తాను గ‌త కొన్నేళ్లుగా ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి , సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ జ‌యేష్ రంజ‌న్. ఆయ‌న గ‌త ప్ర‌భుత్వంలోనూ కూడా కీల‌క పాత్ర పోషించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువు తీర‌డంతో త‌న‌ను త‌ప్పిస్తార‌ని అంతా అనుకున్నారు. కానీ ఊహించ‌ని రీతిలో రేవంత్ రెడ్డి స‌ర్కార్ జ‌యేష్ రంజ‌న్ ను కొన‌సాగించేందుకే మొగ్గు చూపింది.

ఆయ‌న‌పై ఎన్నో ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప‌క్క‌న పెట్టింది. ప్ర‌ధానంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ , లాజిస్టిక్, ప‌రిశ్ర‌మ‌ల ప‌రంగా టాప్ లో నిలిచేందుకు త‌న‌వంతు కృషి చేస్తూ వ‌చ్చారు జ‌యేష్ రంజ‌న్. ప్ర‌స్తుతం ఆయ‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సార‌థ్యంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబుతో క‌లిసి జ‌యేష్ రంజ‌న్ అక్క‌డికి చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం త‌మ ప‌ర్య‌ట‌న స‌జావుగా సాగుతోంద‌ని చెప్పారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా వీడియో సందేశం పోస్ట్ చేశారు.

గడిచిన పదేండ్లుగా రాష్ట్రం తరఫున గ్లోబల్ లీడర్స్ తో ఒప్పందాల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తోన్న అనుభవం తనదని చెప్పారు.