ఎంపీ..ఎమ్మెల్యే టికెట్ అడిగాం
వెల్లడించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం జిల్లా – రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయ పరంగా ఒక వెలుగు వెలిగిన జేసీ కుటుంబం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారారు. ఇక రాయలసీమ రాజకీయాలలో కీలకమైన నేతలుగా మారారు జేసీ బ్రదర్స్.
ఇదిలా ఉండగా ప్రస్తుతం టికెట్ల కేటాయింపు కొనసాగుతోంది. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మరో వైపు టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడుస్తోంది. ఎవరికి ఏ నియోజకవర్గాలు కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ సందర్బంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ పరంగా తమ కుటుంబానికి ఒక ఎంపీ సీటుతో పాటు మరో ఎమ్మెల్యే సీటు కూడా అడిగామన్నారు. ఇలా అడగటం తమ హక్కు అని స్పష్టం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
చాలా మంది నాయకులు టికెట్ వస్తే చాలు గెలుస్తామనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అయితే పార్టీ చీఫ్ ఎవరికి టికెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. కాగా తమకు ఒక్క టికెట్ ఇచ్చినా పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు.