మీకన్నా జగన్ రెడ్డినే మేలు కదరా
అనంతపురం జిల్లా – తాడిపత్రిలో జేసీ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సులు దగ్ధం ఘటనపై స్పందించారు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. మీకన్నా జగన్ రెడ్డినే మేలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ వాళ్ల లాగా జగన్ ఎప్పుడూ బస్సులు తగలబెట్ట లేదన్నారు. తన బస్సులను ఆపాడన్నారు. 300 బస్సులు పోతే ఏడ్వలేదని, ఇప్పుడు ఎందుకు బాధ పడతానంటూ ప్రశ్నించాడు.
జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే ఎదురుగా వచ్చి ఎదుర్కోవాలని ఇలా దొడ్డిదారిన బస్సులను దగ్ధం చేస్తారా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎందుకు ఇలా చేశారో తనకు తెలుసన్నారు. సమయం వచ్చిన సమయంలో అన్నీ బయట పడతాయని చెప్పారు.
ఎవరినీ ఊరికే వదిలేసే ప్రసక్తి లేదని హెచ్చరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాము ఎవరినీ ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవన్నారు. కానీ తమను గెలుక్కోవాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత.