మేం కన్నెర్ర చేస్తే ఎవరూ మిగలరు
జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
అనంతపురం జిల్లా – టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము కన్నెర్ర చేస్తే వైసీపీ నేతలు ఎవరూ మిగలరని, చంద్రబాబు మంచితనం వల్లనే బతికి పోతున్నారని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ వారిని చిత్రహింసలకు గురి చేశారని, కేసులు నమోదు చేశారని ఆరోపించారు. పేర్ని నానికి ఇప్పుడు ఆడవాళ్లు గుర్తుకు వచ్చారా అని నిలదీశారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉండగా ఇష్టానుసారం మాట్లాడారని , బయటకు రాకుండా కేసులు పెట్టారంటూ వాపోయారు. పేర్నినాని బ్యాటరీ లేని వ్యక్తి.. ఇంకా చెబితే బాగోదన్నారు.
అసలు విక్టోరియా ఎవరూ.. ఈ రోజు కన్నీరు పెట్టుకుంటున్నావ్ అంటూ ఎద్దేవా చేశారు. తమ కుటుంబం మీద కేసులు పెట్టినప్పుడు తాము ఎంతో క్షోభకు గురయ్యామని అన్నారు. 5 నెలలోనే వ్తెసీపీ వాళ్లు బయటకు వస్తున్నారంటే చంద్రబాబు మంచితనం తప్ప మరోటి కాదన్నారు.
అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను దారుణంగా ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. పవన్ కళ్యాణ్ ను సైతం విడిచి పెట్టలేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.