ముగిసిన నామినేషన్ల పర్వం
మొత్తం 39 మంది దరఖాస్తులు
జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు మంగళవారం నాటితో ముగిసింది. మొత్తంగా పోటా పోటీగా జర్నలిస్టులు నామినేషన్లు వేసేందుకు ప్రయత్నం చేశారు. ప్రచారాన్ని హోరెత్తించారు. జనరల్ (సాధారణ ) కేటగిరీ కింద 30 దరఖాస్తులు రాగా , మహిళల కేటగిరీ కింద ఆరుగురు దరఖాస్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ కింద ముగ్గురు నామినేషన్లు వేశారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నారు ఎన్నికల అధికారి.
దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి జనరల్ కేటగిరీ కింద జర్నలిస్టులు మీస శ్రీనివాస్ , ఎం. రవీంద్ర బాబు, భూపాల్ రెడ్డి, భీమగాని మహేశ్వర్, బి. తిరుపతి, వి. వీరాంజనేయులు, కమలాకర్ చారి, సత్య పెద్ది రాజు, అల్లం సైదా రెడ్డి, ఆర్డీఎస్ ప్రకాశ్, హష్మి, వెంకటాచారి, సూర్య నారాయణ, సాగర్ , కాసుల ప్రతాప్ రెడ్డి, మునిరాజు, మనోహర్ రెడ్డి, గణేష్ రెడ్డి, వెంకటపతి రాజు, వెంకట రంగా రెడ్డి, సగీరుద్దీన్, శ్రీధర్ బాబు, జాష్వా, గోపరాజు, సురేఖ, జంగారెడ్డి దరఖాస్తు చేశారు.
ఎస్సీ, ఎస్టీ కింద పీటర్ జడ్డా, లక్ష్మీ నారాయణ, గుడిగ రఘు నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. మహిళా కేటగిరీ కింద పి. జమున, కంచి లలిత, స్వచ్ఛ వోటార్కర్ , చల్లా భాగ్యలక్ష్మి, ఎస్. యశోద, కోనేరు రూపా వాణి నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. వీరి మధ్య ఎవరు బరిలో ఉంటారనేది రేపటితో తేలి పోనుంది.