జేసీహెచ్ఎస్ఎల్ ఎన్నికలు జరపాలి
డిప్యూటీ రిజిస్ట్రార్ కు వినతిపత్రం
హైదరాబాద్ – హైదరాబాద్ కు చెందిన జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (JCHSL) సభ్యుల బృందం నాన్ అలాటీస్ కమిటీ మంగళవారం గోల్కొండ కో ఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ రోజా రాణిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
జేసీహెచ్ఎస్ఎల్ కి సంబంధించి ఎన్నికలను హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసిన ప్రకారం వెంటనే నిర్వహించాలని విన్నవించారు. ఒకరిద్దరు గతంలో ఎన్నికలను ఆపడానికి వ్యక్తిగత స్వార్థం తో ఇచ్చిన పాత పిర్యాదుపై తాము కోర్టు కు వెళ్లామని, అన్ని విషయాలు పరిశీలించి జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలు వెంటనే జరపాలని హైకోర్టు తీర్పు లో స్పష్టంగా పేర్కొన్న విషయం ఇప్పటికే తెలియ చేయడం జరిగిందన్నారు .
ఈ విషయం డిప్యూటీ రిజిస్ట్రార్ దృష్టికి తేవడం జరిగింది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన తరువాత కూడా ఒకరిద్దరు తిరిగి పాత విషయాలను మరలా ఉటంకిస్తూ చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని కోరడం జరిగింది.
కో ఆపరేటివ్ చట్టం ప్రకారం ఎన్నికలు జరపాలని హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ముందుకు పోతామని డిప్యూటీ రిజిస్ట్రార్ రోజా రాణి స్పష్టం చేశారని వెల్లడించారు సీనియర్ జర్నలిస్ట్ గోపరాజు .