మతంగా మారి పోయిన క్రికెట్
మాజీ సీబీఐ అధికారి లక్ష్మీ నారాయణ
యావత్ ప్రపంచాన్ని క్రికెట్ శాసిస్తోందని అన్నారు మాజీ సీబీఐ చీఫ్ జేడీ లక్ష్మీ నారాయణ. ప్రముఖ రచయిత, కామెంటేటర్, విశ్లేషకుడు సి. వెంకటేశ్ క్రికెట్ పై రాసిన బిట్స్ అండ్ పీసెస్ – ది లైడర్ సైడర్ ఆఫ్ క్రికెట్ పుస్తకాన్ని జేడీ ఆవిష్కరించారు.
ఈ పుస్తకంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయని చెప్పారు. క్రికెట్ ను చూసే వాళ్లు, ప్రేమించే వాళ్లు, ఆరాధించే ఫ్యాన్స్ కు ఎంతగానో ఉపయోగ పడుతుందని చెప్పారు. ఛాయ పబ్లిషింగ్ హౌస్ తో పాటు అమెజాన్ లో ఈ పుస్తకం లభిస్తోంది.
ఒకప్పు డు భారత దేశంలో హాకీకి ఆదరణ ఉండేదని, కానీ ఎప్పుడైతే స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలో 1983లో వరల్డ్ కప్ ను టీమిండియా కైవసం చేసుకుందో ఆనాటి నుంచి నేటి దాకా దేశాన్ని కుదిపి వేస్తోందన్నారు జేడీ లక్ష్మీనారాయణ.
ఇవాళ ఇండియాలో క్రికెట్ ఓ విడదీయలేని బంధాన్ని పెన వేసుకు పోయిందని అన్నారు. వేల కోట్ల వ్యాపారం జరుగుతోందన్నారు. క్రికెట్ ఫార్మాట్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని, ఇవాళ ఐపీఎల్ కీలకంగా మారిందన్నారు.
ఈ కార్యక్రమంలో రచయిత సి. వెంకటేశ్ తో పాటు మాజీ క్రికెటర్ చాముండేశ్వరి నాథ్, ప్రముఖ జ్యోతిష్కుడు దైవజ్ఞ శర్మ, తదితరులు పాల్గొన్నారు.