జై భారత్ పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తు
కేటాయించిందన్న పార్టీ చీఫ్ జేడీ
విజయవాడ – కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఏపీలో త్వరలో శాసన సభ , పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్.
గురువారం ఈ మేరకు ఈసీ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మి నారాయణకు తీపి కబురు చెప్పింది. ఇందులో భాగంగా తాను ఇటీవలే స్థాపించిన జై భారత్ జాతీయ పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తును కేటాయించింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ఆ పార్టీ చీఫ్.
కామన్ సింబల్ ను కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు జేడీ లక్ష్మీ నారాయణ. రాబోయే ఎన్నికల్లో బ్యాటరీ టార్చ్ వెలిగిద్దామని, చీకటిని పార దోలుదామని పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసీ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కామన్ సింబల్ గా బ్యాటరీ టార్చ్ ని కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. అన్నింటికి ఒకే గుర్తు రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు జేడీఎల్.