Wednesday, April 2, 2025
HomeNEWSNATIONALతాగుబోతుల‌కు 2 బాటిళ్లు ఫ్రీగా ఇవ్వండి

తాగుబోతుల‌కు 2 బాటిళ్లు ఫ్రీగా ఇవ్వండి

జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ క్రిష్ణ‌ప్ప డిమాండ్

బెంగ‌ళూరు – జేడీఎస్ ఎమ్మెల్యే క్రిష్ణ‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్ణాట‌క అసెంబ్లీలో ఆయ‌న మందుబాబుల‌ను ఉద్దేశించి వారానికి రెండు మ‌ద్యం బాటిళ్ల‌ను ఉచితంగా ఇవ్వాల‌ని కోరారు. మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ. 2000, ఉచితంగా విద్యుత్ తో పాటు అన్నీ ఫ్రీగా ఇస్తున్నార‌ని, కానీ మందు బాబులు ఏం పాపం చేశారంటూ ప్ర‌శ్నించారు. ప్రభుత్వానికి ఏటా రూ.40 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న వాళ్లకు మందు బాటిళ్లు ఫ్రీగా ఇస్తే తప్పేంటని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. దీంతో తాగుబోతులంతా ఎమ్మెల్యే క్రిష్ణ‌ప్ప‌కు ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా జేడీఎస్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి రాజ‌కీయ వ‌ర్గాల‌లో. మ‌హిళ‌లు అన్ని ర‌కాలుగా ల‌బ్ది పొందుతున్నార‌ని, మ‌రి పురుషుల‌కు మ‌ద్యం ఫ్రీగా ఇస్తే అభ్యంత‌రం ఎందుక‌ని స‌ర్కార్ ను నిల‌దీశారు. సీఎం సిద్ద‌రామ‌య్య ఎక్సైజ్ ఆదాయ ల‌క్ష్యాన్ని రూ. 36 వేల కోట్ల నుంచి రూ. 40 వేల కోట్ల‌కు పెంచ‌డంపై ఈ వ్యాఖ్య‌లు చేశారు. మీరు ఉచితంగా అందిస్తున్నవ‌న్నీ ప్ర‌జ‌ల నుంచి ప‌న్నుల రూపేణా వ‌సూలు చేసిన డ‌బ్బులేన‌ని అన్నారు. మ‌రి ఉచితంగా మ‌ద్యాన్ని ఇస్వే పోయేది ఏమీ ఉండ‌ద‌న్నారు కృష్ణ‌ప్ప‌. కాగా ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments