Monday, April 21, 2025
HomeDEVOTIONALమ‌హా కుంభ మేళలో టీటీడీ న‌మూనా ఆల‌యం

మ‌హా కుంభ మేళలో టీటీడీ న‌మూనా ఆల‌యం

ప‌నులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఆదేశం

తిరుప‌తి – ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్ )లో జరుగనున్న మహా కుంభమేళకు టిటిడి తరుపున నమూనా ఆలయ నిర్మాణం పనులను సకాలంలో పూర్తి చేయాలని టిటిడి తిరుపతి జేఈవో ఎం. గౌతమి అధికారులను ఆదేశించారు టిటిడి పరిపాలనా భవనంలోని మీటింగ్ హాలులో ఆమె సమీక్ష నిర్వహించారు.

ప్రయాగ్ రాజ్ (అలహాబాద్ )లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభ మేళలో జరుగనున్న నేపథ్యంలో టిటిడి పాలకమండలి నిర్ణయం మేరకు ఈవో శ్రీ శ్యామలరావు ఆదేశాలతో తిరుమల స్వామివారి ఆలయంలో జరుగుతున్న కైంకర్యాలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

12 సంవత్సరాలకోసారి పుష్కారాలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఏడాది మహా కుంభమేళ ప్రయాగ్ రాజ్ లో జరుగుతోందన్నారు. అలాంటి పవిత్ర పుణ్య స్థలంలో స్వామి వారి నమునా ఆలయం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మరింత ఆధ్యాత్మికతను పెంచేందుకు టిటిడి పటిష్ట ఏర్పాట్లు చేస్తోందన్నారు.

ప్రయాగ్ రాజ్ కు విచ్చేసే అశేష భక్తులకు స్వామి వారిని దర్శించుకునే అవకాశం టిటిడి కల్పిస్తోందన్నారు. జనవరి 12 వ తేది స్వామివారికి సంప్రోక్షణ చేసి, అచల ప్రతిష్ట తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులకు పవిత్రతతో 13వ తేది నుంచి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు జరుగనున్నాయన్నారు.

మహాకుంభమేళ అంటేనే కొన్ని సంవత్సరాపాటు తపస్సు చేస్తున్న మునులు, సాధువులు పవిత్ర గంగాజలంలో స్నానం ఆచరించి పుణ్యం పొందేందుకు వస్తారని, అలాంటి పవిత్ర స్థలంలో స్వామి వారి ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని స్వామి వారి సేవలను భక్తులకు అందించేలా టిటిడి ఏర్పాట్లు చేస్తోందన్నారు.

శ్రీవారి నమూనా ఆలయంలో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అవసరమైన అధికారులను, సిబ్బందిని డిప్యూటేషన్ చేసుకోవాలని సూచించారు.

ఎలాంటి రాజీ లేకుండా పుష్ప, విద్యుత్ అలంకరణలు చేపట్టాలన్నారు. హెచ్ డి పిపి , ఎస్వీ సంగీత కళాశాల, అన్నమయ్య ప్రాజెక్ట్ నుంచి అవసరమైన కళాకారులతో సంగీత, సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన ప్రాంతాలలో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేలా ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు.

స్వామి వారి ఆవిర్భావం నుంచి ప్రధాన ఘట్టాలతో కూడిన పుస్తకాలను హిందీ, ఇంగ్లీష్ భాషలలో ముద్రించి భక్తులకు విరివిగా పంపిణీ చేయాలన్నారు. ఎస్వీబీసీ, టిటిడి సోషల్ మీడియా ద్వారా ఇప్పటి నుంచే ప్రోమోలు ప్రసారం చేయాలన్నారు.

తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ టిటిడి అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీవారి నమునా ఆలయాన్ని ప్రయాగ్ రాజ్ లో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. జనవరి 13వ తేది నుంచి స్వామి వారి కైంకర్యాలు జరుగుతాయన్నారు. భక్తులు అందరూ నమునా ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జనవరి 12 వ తేదిన స్థల శుద్ది కోసం వాస్తు హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో డిపిపి సెక్రటరీ రఘునాథ్, డిపిపి ప్రోగ్రాం ఆఫిసర్ రాజగోపాల్. డిప్యూటీ ఈవోలు ఆర్. సెల్వం, శివప్రసాద్, ప్రశాంతి, గుణభూషణ్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments