NEWSNATIONAL

రాహుల్ కు మ‌ద్దతు ఇవ్వండి

Share it with your family & friends

పిలుపునిచ్చిన జార్ఖండ్ సీఎం

జార్ఖండ్ – కేంద్రంపై యుద్దం ప్ర‌క‌టించిన ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని పిలుపునిచ్చారు జార్ఖండ్ నూత‌న సీఎంగా కొలువు తీరిన చెంపై సోర‌న్ . రాహుల్ చేప‌ట్టిన యాత్ర జార్ఖండ్ కు చేరుకుంది. ఈ సంద‌ర్బంగా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు సీఎం.

రాహుల్ గాంధీతో క‌లిసి తాను కూడా యాత్ర చేప‌డ‌తానంటూ ప్ర‌క‌టించారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్ దేశంలో ప్ర‌తిప‌క్షాలు లేకుండా చేయాల‌ని అనుకుంటోంద‌ని ఆరోపించారు. ఇందులో భాగంగా త‌మ స‌ర్కార్ ను కూల్చే ప‌నిలో ప‌డింద‌ని , కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల స‌హ‌కారంతో తాము ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల పేరుతో ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేసింద‌ని ఆరోపంచారు సీఎం. అయినా తాము వెనుదిరిగే ప్ర‌సక్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని క‌ష్టాల‌కు గురి చేసినా తాము భ‌య‌ప‌డమ‌ని ప్ర‌క‌టించారు చెంపై సోరేన్. భార‌త్ జోడో న్యాయ్ యాత్ర
వ‌ల్ల కోట్లాది మంది ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌లుగుతోంద‌ని చెప్పారు.