జార్ఖండ్ లో ఇండియా కూటమిదే జోరు
48 స్థానాలలో అభ్యర్థులు ఆధిక్యం
జార్ఖండ్ – భారతీయ జనతా పార్టీ కూటమికి బిగ్ షాక్ తగిలింది. జార్ఖండ్ లో మరోసారి హేమంత్ సోరేనే సీఎం కానున్నారు. ఇండియా కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేసే దిశగా పరుగులు పెడుతోంది. మొత్తం 81 స్థానాలకు గాను ఇండియా 48 స్థానాలలో భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఇండియా కూటమి ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇక్కడ మోడీ , అమిత్ చంద్ర షా, ఇతర నేతల జిమ్మిక్కులు పని చేయలేదు. హేమంత్ సోరేన్ కు అనుంగు అనుచరుడిగా ఉంటూ వచ్చిన చంపా సోరేన్ ను చీల్చినా చివరకు బీజేపీ ప్లాన్ వర్కవుట్ కాలేదు. జనం ఎన్డీయే కూటమిని ఛీకొట్టారు. కొన్ని సీట్లకే పరిమితం చేశారు.
అయితే మరోసారి హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ప్లాన్ చేస్తుండగా ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది అని చెప్పక తప్పదు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పార్టీ తరపున ఇంఛార్జ్ గా ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన మహారాష్ట్రలో ఇండియా కూటమి అభ్యర్థులకు చుక్కెదురు కావడం విశేషం.