NEWSTELANGANA

సీఎంతో జికా కంపెనీ ప్ర‌తినిధుల భేటీ

Share it with your family & friends

మెట్రో రైల్ విస్త‌ర‌ణ‌..మూసీ న‌దికి నిధులు

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ కంపెనీ జికాకు చెందిన ప్ర‌తినిధులు సైటో మిత్సునోరీ భేటీ అయ్యారు. స‌చివాల‌యంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, సమాచార పౌర సంబంధాల అధికారి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కూడా ఉన్నారు.

హైద‌రాబాద్ లో మెట్రో రైల్ విస్త‌ర‌ణ‌, మూసీ న‌దీ ప‌రివాహ‌క అభివృద్దికి త‌క్కువ వ‌డ్డీకే రుణాలు అంద‌జేసేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. వివిధ విభాగాల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని సైటో మిత్సునోరీ స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం మెట్రో రైల్ , మూసీ న‌ది పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది. ఇప్ప‌టికే ప‌లు న‌గ‌రాల‌లో ప‌ర్య‌టించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయ‌న లండ‌న్ , దుబాయ్, అమెరికా దేశాల‌లో ప‌ర్య‌టించి వాస్త‌వ ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు.

ప‌లు కంపెనీలతో ఈ సంద‌ర్బంగా భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి బృందం. ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో ముందుకు వెళ్లాల‌ని సూచించారు. ఇదే స‌మ‌యంలో భారీ ఎత్తున నిధులు అవ‌స‌రం అవుతాయి. అందుకే వివిద దేశాల‌కు చెందిన కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తున్నాయి.