జియో హాట్ స్టార్ బిగ్ హిట్
ముంబై – దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విశ్వ విజేతగా నిలిచింది. ఈ టోర్నీ మొత్తాన్ని రిలయన్స్ అంబానీ గ్రూప్ కు చెందిన జియో హాట్ స్టార్ ప్రసారం చేసింది. టెలికాస్ట్ తో పాటు వివిధ మాధ్యమాల ద్వారా క్రికెట్ ప్రేమికులకు ఆనందాన్ని ఇచ్చింది. ఊహించని రీతిలో ఈ మెగా క్రికెట్ ఈవెంట్ ను ఏకంగా 540.3 కోట్ల మంది చూడడం విస్తు పోయేలా చేసింది. గత ఫిబ్రవరి నెల 19 నుండి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ కొనసాగింది. ఈ టోర్నీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హోస్ట్ చేసింది.
కానీ ఆ జట్టు ఏ ఒక్క మ్యాచ్ గెలవలేదు. ఈ టోర్నీని 11,000 కోట్ల నిమిషాల పాటు వీక్షించారని , 6.2 కోట్ల మంది వీక్షకులతో అరుదైన ఘనత సాధించిందని జియో హాట్ స్టార్ ప్రకటించింది. పలు నివేదికలు కూడా ఇదే విషయాన్ని పంచుకున్నాయి. ఈ టోర్నీ తో జియో హాట్ స్టార్ సంస్థకు భారీ ఎత్తున ఆదాయం సమకూరింది. ఇక ఇండియా అంటేనే క్రికెట్ క్రికెట్ అంటేనే భారత్ అనే స్థాయికి ఇప్పుడు మారి పోయింది. మరో వైపు మరో ఇంటర్నేషనల్ మెగా టోర్నీకి సిద్దమవుతోంది భారత్. ప్రతి ఏటా జరిగే టాటా ఐపీఎల్ టోర్నీ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్దం చేసింది బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహక కమిటీ.
జియోస్టార్ బ్రాడ్‌కాస్టర్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ , స్పోర్ట్స్18 నెట్‌వర్క్‌ల ద్వారా ప్రసారం చేయగా, జియోహాట్‌స్టార్ వెబ్‌సైట్ , అప్లికేషన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ను అత్యధికంగా చూశారని వెల్లడించింది. ఈ ఒక్క మ్యాచ్ ను ఏకంగా 124.2 కోట్ల వీక్షణలు రావడం విశేషం.