కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారరు
ఆముదాలపాడు జితేందర్ రెడ్డి
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీలో పార్టీ ప్రభుత్వ ప్రతినిధి ఆముదాలపాడు జితేందర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఇబ్బందుల్లో పడటం ఖాయమని పదే పదే బీజేపీ నాయకులు చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారరని, వారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లరంటూ స్పష్టం చేశారు. ఆయన బుధవారం ఓ మీడియాతో సంభాషించారు. గతంలో బీజేపీలో ఉన్నారు. అంతకు ముందు టీడీపీలో, బీఆర్ఎస్ లో కీలక పదవులు నిర్వహించారు.
తాజాగా శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఉన్నట్టుండి పార్టీ మారారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనను పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. దీంతో ఇద్దరూ ఒకే పాలమూరు జిల్లాకు చెందిన వారు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
జితేందర్ రెడ్డికి అన్ని పార్టీలతో సత్ సంబంధాలు కలిగి ఉన్నారు. సౌమ్యుడు అన్న పేరు కూడా ఉంది. మొత్తంగా ఇప్పుడు కేబినెట్ హోదాతో కొనసాగుతున్నారు.