తమ పాలనలో 16 మిలియన్ల జాబ్స్
ప్రకటించిన ప్రెసిడెంట్ జోసెఫ్ బైడెన్
అమెరికా – అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పాలనపై పదే పదే మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రెసిడెంట్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అబద్దాలకు కేరాఫ్ అంటూ మండిపడ్డారు. వ్యవస్థలను నాశనం చేసి, అమెరికా పరువును ప్రపంచ మార్కెట్ లో చులకన చేసేలా చేసిన ట్రంప్ కు అంత సీన్ లేదన్నారు. ఆయనకు తమను ప్రశ్నించే హక్కు లేదని స్పష్టం చేశారు బైడెన్.
ద్రవ్యోల్బణంకు సంబంధించి ఆసక్తికర సమాచారం పంచుకున్నారు దేశ అధ్యక్షుడు. ద్రవ్యోల్బణం ప్రస్తుతం 2.1 శాతానికి పడి పోయిందన్నారు. దాదాపు 2 శాతం లక్ష్యంగా పెట్టుకున్నామని దానిని కూడా చేరుకునేందుకు ప్రయత్నం చేశామని చెప్పారు జోసెఫ్ బైడెన్.
ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి తమకు మాంద్యం అవసరమని విమర్శకులు చెప్పినప్పటికీ తీవ్రంగా కృషి చేశామని, ప్రస్తుతం 16 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించి, 21వ శతాబ్దంలో అధ్యక్ష పదవికి ఎన్నడూ లేనంత వేగవంతమైన రేటుతో ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు జో బైడెన్.