ఏపీలో మళ్లీ మాదే అధికారం
మంత్రి జోగి రమేష్ కామెంట్
అమరావతి – ఏపీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు నూరైనా సరే , ఎన్ని అల్లర్లు సృష్టించినా చివరకు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది తామేనని స్పష్టం చేశారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
పనిగట్టుకుని కేంద్రంతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రంలో ప్రజలను అయోమానికి గురి చేయాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , బీజేపీ ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కానీ వారి ఆటలు సాగలేదని, కుట్రలు వర్కవుట్ కాలేదని ధ్వజమెత్తారు జోగి రమేష్.
ప్రజలు సమర్థవంతమైన నాయకుడిని, సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటారని ఈ రెండింటిని ఈ దేశంలో అందిస్తున్న ఏకైక లీడర్, వైసీపీ బాస్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. ఇకనైనా చంద్రబాబు బుద్ది తెచ్చుకుని మసులుకుంటే మంచిదని సూచించారు. చిల్లర రాజకీయాలు మానేస్తే బెటర్ అంటూ హితవు పలికారు.
తమ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగా సీట్లు వస్తాయని ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మనందరం సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి జోగి రమేష్.