కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక దాడి నిజమే
నిర్ధారించిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ – ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాక్ తగిలింది. ఉన్నట్టుండి బెయిల్ పై విడుదలైన జానీ మాస్టర్ కిమ్స్ లో ప్రత్యక్షం అయ్యాడు. లైంగిక వేధింపుల కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగికంగా దాడి చేసినట్లు విచారణలో నిర్దారణ అయ్యింది. ఈవెంట్స్ పేరుతో పలు ప్రాంతాలకు తీసుకు వెళ్లి..అక్కడే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పేర్కొన్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా తనపై కొందరు కావాలని కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు కొరియోగ్రాఫర్. ఇదంతా తను ఎదుగుతుంటే సినీ ఇండస్ట్రీలో తట్టుకోలేక తప్పుడు కేసు నమోదు చేశారంటూ వాపోయారు జానీ మాస్టర్.
ఈ కేసుకు సంబంధించి జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన అరెస్ట్ వెనుక సుకుమార్, బన్నీ ఉన్నారంటూ వచ్చిన ప్రచారం పూర్తిగా అబద్దమని కొట్టి పారేశారు కొరియోగ్రాఫర్. విచిత్రం ఏమిటంటే అనుకోకుండా కిమ్స్ ఆస్పత్రి వద్ద ప్రత్యక్షం అయ్యాడు జానీ మాస్టర్. కొరియోగ్రాఫర్ల తరపున శ్రీతేజ్ కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించాడు. ఈ సమయంలోనే పోలీసులు కోలుకోలేని దెబ్బ కొట్టారు. తను కచ్చితంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్దారించారు.