జూలు విదిల్చిన బట్లర్
సెంచరీతో ఆర్సీబీకి షాక్
జైపూర్ – రాజస్థాన్ లోని జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ కీలక లీగ్ పోరులో ఆద్యంతం అభిమానులకు ఆనందం మిగిలింది. ఇరు జట్లు అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 రన్స్ చేసింది. రన్ మెషీన్ కోహ్లీ 113 రన్స్ తో ఆకట్టుకోగా డుప్లిసిస్ 44 రన్స్ తో రాణించాడు.
అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఆది లోనే షాక్ తగిలింది. జైశ్వాల్ 1 రన్ చేసి ఔట్ అయ్యాడు. మైదానంలోకి దిగిన కెప్టెన్ శాంసన్ బట్లర్ తో కలిసి పరుగుల వరద పారించాడు. ఇద్దరూ కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
గత కొన్ని మ్యాచ్ లలో అంతగా రాణించని జోస్ బట్లర్ ఈ మ్యాచ్ లో జూలు విదిల్చాడు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు.58 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 4 భారీ సిక్సర్లు కొట్టాడు. ఏకంగా సెంచరీతో తనకు ఎదురే లేదని చాటాడు. శాంసన్ 69 పరుగులు చేసి ఆఖరులో అవుట్ అయ్యాడు సిరాజ్ బౌలింగ్ లో. 42 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి.