చితక్కొట్టిన జోస్ బట్లర్
కోల్ కతా బౌలర్లకు చెక్
కోల్ కతా – ఐపీఎల్ 2024 లో దుమ్ము రేపింది రాజస్థాన్ రాయల్స్. కోల్ కతా ముందుంచిన 224 పరుగుల భారీ టార్గెట్ ను అవలీలగా ఛేదించింది. 2 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఒకానొక సమయంలో వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నా జోస్ బట్లర్ అడ్డు గోడలా నిలిచాడు. అంతా తానై షాట్స్ ఆడాడు.
బట్లర్ కు తోడు రియన్ పరాగ్ , రోమెన్ పావెల్ అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. ఆఖరి వరకు ఉండి రాజస్థాన్ రాయల్స్ కు చిరస్మరణీయమైన విజయాన్ని కట్ట బెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రారంభ మ్యాచ్ లలో ఆశించిన మేర రాణించ లేక పోయినా ఆ తర్వాత మ్యాచ్ లలో సత్తా చాటుతూ వచ్చాడు జోస్ బట్లర్.
వరుణ్ చక్రవర్తికి షాక్ ఇచ్చాడు. తను వేసిన 15వ ఓవర్ లో జోష్ నాలుగు ఫోర్లు కొట్టాడు. పావెల్ సునీల్ నరైన్ ను ఏకి పారేశాడు. 4,6,6 కొట్టాడు. హరిత్ రాణా వేసిన 19వ ఓవర్ లో ఏకంగా 19 రన్స్ పిండుకున్నాడు. చక్రవర్తి వేసిన ఆఖరి ఓవర్ లో కావాల్సిన 9 రన్స్ పూర్తి కానిచ్చేశాడు. జోస్ బట్లర్ 107 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 9 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి.