రేపే జీసీహెచ్ఎస్ఎల్ ఎన్నికలు
హోరా హోరీగా ప్రచారం
హైదరాబాద్ – హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (జేసీహెచ్ఎస్ఎల్) ఎన్నికలు ఈనెల 18న బుధవారం జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల అధికారి రాజేందర్ రెడ్డి ఎన్నికల గుర్తులు, సభ్యులకు సూచనలు అందజేశారు. గతంలో ఒకే ఒక పోలింగ్ బూత్ ఉండగా ఈసారి రిజర్వేషన్ల వారీగా పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు.
మొత్తం జేసీహెచ్ఎస్ఎల్ లో 9 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరిలో ఆరుగురిని జనరల్ అభ్యర్థులు, ఒకరు ఎస్సీ, ఎస్టీ కేటగిరీ నుంచి ఇద్దరిని మహిళా కేటగిరీ నుంచి సభ్యులు తమ విలువైన ఓటు హక్కు వినియోగించు కోవాల్సి ఉంటుంది.
ఓటు వేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు జూబ్లీహిల్స్ లోని సంస్థ కార్యాలయంలో. పోటీ చేసే అభ్యర్థులు లేదా ఓటు వేసే వారు 20 మీటర్ల దూరంలో ఉండాలని రిటర్నింగ్ ఆఫీసర్ స్పష్టం చేశారు. ఈసారి పోటీ రసవత్తరంగా మారింది. మొత్తం మూడు ప్యానల్స్ రంగంలోకి దిగాయి. వెంకటాచారి, హష్మి ప్యానల్ , బ్రహ్మాండగిరి గోపరాజు, లక్ష్మీనారాయణ ప్యానల్ తో పాటు వీరాంజనేయులు, జమున ప్యానల్ బరిలోకి దిగింది.
పోలింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు ముగుస్తుంది. ఆ తర్వాత వచ్చే సభ్యులకు ఓటు వినియోగించుకునే అవకాశం ఉండదు. ప్రతి సభ్యుడు 9 మందికి ఓటు వేయాల్సి ఉంటుంది. ఆరుగురికి సంబంధించి తెల్ల బ్యాలట్ పేపర్, ఎస్టీ, ఎస్టీకి సంబంధించి నీలి రంగు బ్యాలెట్ , ఇద్దరు మహిళలకు సంబంధించి గులాబీ రంగు బ్యాలట్ పేపర్ లను ఇస్తారు.
సభ్యులు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. 9 మంది కంటే ఎక్కువ వేసినా ఆ ఓటు చెల్లకుండా పోతుంది. ఇక మూడు ప్యానెల్స్ తో పాటు కొందరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. మొత్తంగా ఈసారి ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.