జేసీహెచ్ఎస్ఎల్ ఎన్నికలకు సహకరించాలి
ఎన్నికల అధికారి రాజేందర్ రెడ్డి సూచన
హైదరాబాద్ – ఈనెల 18వ తేదీన జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (జేసీహెచ్ఎస్ఎల్ ) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారి రాజేందర్ రెడ్డి అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. పోటీ చేసే అభ్యర్థులకు ఐడి కార్డులు ఇస్తామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాలలో అనుమతి ఉంటుందన్నారు. 20 మీటర్ల లోపు ఎవరూ ఉండ కూడదని స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు.
గురువారం అందుబాటులో ఉన్న మూడు ప్యానళ్ళ ప్రతినిధులతో రాజేందర్ రెడ్డి సమావేశమయ్యారు. మూడు గంటలకి గేట్లు మూసి వేస్తామని, తర్వాత వచ్చే వారికి ఓటు వేసే హక్కు ఉండబోదని స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్క సొసైటీ సభ్యులు ఎన్నికల అధికారులతో సహకరించాలని కోరారు.
మహిళల రిజర్వేషన్ కు ప్రత్యేకంగా ఒక బూత్ ఉంటుందని, అదే విధంగా ఎస్సీ కేటగరీలో మరొక బూత్ ఏర్పాటు చేస్తామని అన్నారు. జనరల్ కేటగిరి కోసం రెండు పోలింగ్ బూత్ లు ఉంటాయని చెప్పారు. కాగా లంచ్ టైం వరకు మెజార్టీ పోలింగ్ పూర్తి అయ్యే విధంగా మూడు ప్యానల్ ల అభ్యర్థులు చొరవ తీసుకోవాలని కోరారు రాజేందర్ రెడ్డి.
మూడు గంటల తర్వాత క్యూలో ఉన్న వాళ్లకు మాత్రమే అనుమతిస్తామని అన్నారు. ప్రతి ఒక్క బూత్ కు ముగ్గురు ఏజెంట్లు ఉంటారని, ఒక్కొక్క బూత్ కు, ఒక్కొక్క ప్యానెల్ నుంచి ఒక్కొక్క ఏజెంట్ ను నియమించుకోవచ్చు అని తెలిపారు ఎన్నికల అధికారి. పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు ఏజెంట్ల పేర్లు సమర్పించాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లో పేరు, గుర్తు, ఫోటో కూడా ఉంటాయని చెప్పారు. పోలింగ్ మూవీస్ ముగిసిన అనంతరం కౌంటింగ్ స్టార్ట్ అవుతుందని రాజేందర్ రెడ్డి వెల్లడించారు.