NEWSNATIONAL

పార్ల‌మెంట్ ఎంపీ అభ్య‌ర్థులు ఖ‌రారు

Share it with your family & friends

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా

న్యూఢిల్లీ – దేశంలో ఇంకా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ప్ర‌క‌టించ లేదు కేంద్ర ఎన్నిక‌ల సంఘం. కానీ భార‌తీయ జ‌న‌తా పార్టీ మాత్రం ముంద‌స్తుగానే ఎన్నిక‌ల రంగానికి సిద్ద‌మ‌వుతోంది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా తొలి జాబితాను ప్ర‌క‌టించారు. మొత్తం 545 లోక్ స‌భ స్థానాల‌కు గాను తొలి విడ‌త‌లో 195 మంది ఎంపీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో 9 మంది సీట్ల‌ను ఖ‌రారు చేసింది. మొత్తం 17 సీట్లు ఉన్నాయి. ఇంకా 8 సీట్ల‌ను ఖ‌రారు చేసింది. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక్క సీటును ఖ‌రారు చేయ‌లేదు జేపీ న‌డ్డా. తొలి జాబితాలో 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్ల‌ను ఖ‌రారు చేశారు.

ఇదిలా ఉండ‌గా ఏపీలో ఇంకా పొత్తులు ఖ‌రారు కాలేదు. అందుక‌ని అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ లేద‌ని స‌మాచారం. క్లారిటీ వ‌చ్చాక అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్న‌ట్లు టాక్. వార‌ణాసి నుండి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ బ‌రిలో నిల‌వ‌నున్నారు. గుజ‌రాత్ లోని గాంధీన‌గ‌ర్ నుంచి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా పోటీ చేయ‌నున్నారు.

బీజేపీ ప్ర‌క‌టించిన 195 మంది అభ్య‌ర్థుల తొలి జాబితాలో 28 మంది మ‌హిళ‌లకు కేటాయించ‌గా 57 మంది ఓబీసీ, 27 మంది ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థులు ఉన్నారు.